భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: ఈ నెల 15వ తేదీన సోమవారం అర్వపల్లి మండల కేంద్రంలో లక్ష్మీ ఫంక్షన్ హాల్‌లో మాజీ శాసనసభ్యులు కిషోర్ అన్న అధ్యక్షతన నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లు, BRS డిజిటల్ సభ్యత్వ ఇంఛార్జ్‌ల సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంఛార్జ్‌ రాష్ట్ర BRS కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, నియోజక వర్గం సభ్యత్వ…