భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, జూన్ 2026, సోమవారంభారత్ సమాచార్

బ్రేక్ ఫాస్ట్‌లో బొద్దింక కలకలం

WhatsApp Image 2026-06-14 at 6.54.09 PM (1)

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ మరోసారి వార్తల్లో నిలిచింది. E1, E2 శక్తి మెస్ లో బ్రేక్ ఫాస్ట్‌లో బొద్దింక కలకలం రేపింది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా వడ్డించిన చపాతీ ఆలూ కూర్మలో బొద్దింక ప్రత్యేక్షమైంది. టిఫిన్ లో బొద్దింకను చూసి విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకున్నాయని, ఆకలి వేసినా భోజనం చేయలేని పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులు నాణ్యమైన ఫుడ్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో మెస్ నిర్వాహకులపై వర్సిటీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, ఆహార నాణ్యత విషయాల్లో ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని వారు స్పష్టం చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను తేల్చేందుకు తక్షణమే ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు వర్సీటీ అధికారులు తెలిపారు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.