భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, సెప్టెంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు నేటి మహిళలకు ప్రేరణ

WhatsApp Image 2025-09-10 at 11.33.47 AM

భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి నివాళులర్పించారు బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తదితరలు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు, ఆమె చేసిన పోరాటలను గుర్తు చేసుకున్నారు. చాకలి ఐలమ్మ ఒక మహిళగా జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా.. తెలంగాణ సాయుధ పోరాటంలో చూపిన ధైర్యసాహసాలు నేటి తరం మహిళలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. రజక సంఘాల ప్రతినిధులు ఆమె సేవలను స్మరించుతూ.. సమాజంలో సమానత్వానికి ఆమె పోరాటాన్ని గుర్తుచేశారు.