భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, ఆగస్టు 2026, మంగళవారంభారత్ సమాచార్

ఉపసర్పంచుల మండల ఫోరం అధ్యక్షుడిగా మహేష్

46a4d797-97d5-44b9-a0bd-7f146012224a

భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం మద్నూర్ మండల కమిటీని మంగళవారం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్ మార్గదర్శకత్వంలో, జిల్లా అధ్యక్షుడు దుంపటి రాజు ఆదేశాల మేరకు, జుక్కల్ నియోజకవర్గ అధ్యక్షుడు బొమ్మల నాగరాజు ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల దుర్గ నరేష్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పూజారి గణేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా బొమ్మల నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉప సర్పంచుల హక్కుల పరిరక్షణ, గౌరవం, అధికారాల సాధనే ఉప సర్పంచుల ఫోరం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి మండలంలో బలమైన కమిటీలను ఏర్పాటు చేసి ఉప సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం సమష్టిగా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఉప సర్పంచుల హక్కుల సాధనకు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

మండల గౌరవ అధ్యక్షుడు క్యాతమ్‌వార్ మహేష్ మాట్లాడుతూ ఉప సర్పంచుల చెక్ పవర్ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే శిలాఫలకాలపై సర్పంచ్‌లతో పాటు ఉప సర్పంచుల పేర్లను కూడా తప్పనిసరిగా పొందుపరచాలని కోరారు. ఉప సర్పంచులకు నెలకు రూ.5,000, వార్డు సభ్యులకు రూ.3,000 గౌరవ వేతనం ఇవ్వాలని, ఉప సర్పంచులకు వైస్ చైర్మన్ హోదాతో పాటు సర్పంచ్‌తో సమానంగా సంతకం చేసే అధికారాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.

ప్రతి ప్రభుత్వ, మండల స్థాయి అధికారిక కార్యక్రమానికి ఉప సర్పంచులను కూడా గౌరవ అతిథులుగా ఆహ్వానించాలని మహేష్ కోరారు. అనంతరం మద్నూర్ మండల కమిటీని ప్రకటించారు. రూసేగావ్‌కు చెందిన క్యాతమ్‌వార్ మహేష్‌ను మండల అధ్యక్షుడిగా, షేకాపూర్‌కు చెందిన ఎం.డి. ఫక్రును ఉపాధ్యక్షుడిగా నియమించారు. కార్యక్రమంలో మండలంలోని పలువురు ఉప సర్పంచులు, ఫోరం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.