భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, సెప్టెంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

rains_7639377c92_v_jpg

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు మరో వారం రోజులపాటు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని లోతట్టు ప్రాంతాల ప్రజలు, నగరంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావారణ శాఖ సూచించింది.

 

గురువారం ఉదయం నుంచి కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. యాచారంలో 17.9 సెం.మీ నమోదు కాగా.. మెదక్ జిల్లా కేంద్రంలో 17.8 సెం.మీ. వర్షం కురిసింది. ఇక నిర్మల్, నల్గొండ, నిజామాబాద్, సూర్యాపేట్, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

 

మరో కొన్ని రోజులు వర్షాలు ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సహా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

 

మరిన్ని కథనాలు: 

CP Radhakrishnan: భారత్ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం