భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు మరో వారం రోజులపాటు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని లోతట్టు ప్రాంతాల ప్రజలు, నగరంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావారణ శాఖ సూచించింది.
గురువారం ఉదయం నుంచి కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. యాచారంలో 17.9 సెం.మీ నమోదు కాగా.. మెదక్ జిల్లా కేంద్రంలో 17.8…





