భారత్ సమాచార్.నెట్, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు గూళ్ళ లింగం లావణ్యల నూతన గృహ ప్రవేశం చేశారు. వీరి గృహ ప్రవేశం పూజ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వంలో పేదల ఇంటి కల నెరవేర్చడానికి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని.. తొలి దశలో మంజూరు అయిన ఇందిరమ్మ ఇళ్లు పనులు వేగవంతంగా పూర్తి చేశామని.. ఇంకొన్ని గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని.. మధ్య తరగతి ప్రజలకు ఇల్లు ఓ కల అని.. ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలని.. ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
12, సెప్టెంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్