భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, ఆగస్టు 2026, సోమవారంభారత్ సమాచార్

లింగంపల్లి బోనాల ఉత్సవాల్లో నందమూరి దీపిక జానకిరామ్ పూజలు

2fc133a8-4b8e-46d9-8514-fa7883b9c11c

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు నందమూరి దీపిక జానకిరామ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

లింగంపల్లి గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా బోనాల ఉత్సవాలను నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రాకతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.

ఉత్సవాల్లో పోతురాజు విన్యాసాలు, బోనాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ వాయిద్యాలు, భక్తుల జైజయధ్వానాల మధ్య సాగిన ఊరేగింపు గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకుంది. మహిళలు బోనాలు ఎత్తుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించారు.

ఈ సందర్భంగా నందమూరి దీపిక జానకిరామ్‌కు ఉత్సవ నిర్వాహకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమెను శాలువతో సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బోనాల ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.