భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు నందమూరి దీపిక జానకిరామ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
లింగంపల్లి గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా బోనాల ఉత్సవాలను నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రాకతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.
ఉత్సవాల్లో పోతురాజు విన్యాసాలు, బోనాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా…





