భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందన్న అక్కసుతో నాలుగేళ్ల కూతురిని హత్య చేసిన తల్లి, ప్రియుడిని జిల్లా పోలీసులు అరెస్టు చేసి, కేసు మిస్టరీని ఛేదించారు. మూడు రోజుల క్రితం చిన్నారిని హత్య చేసిన నిందితులు పరారీలో ఉన్నారు. శివంపేట మండలం శభాష్‌పల్లికి చెందిన బంటు రాజు, తన కూతురు మమత, మనవరాలు మనుశ్రీ కనిపించడం లేదని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో మమతకు గ్రామానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని గుర్తించారు.
ఈ నేపథ్యంలోనే మమత, ఫయాజ్ కలిసి మూడు నెలల క్రితం చిన్నారిని హత్య చేసి గ్రామ పొలిమేరలో పాతిపెట్టారని పోలీసులు నిర్ధారించారు. పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని శుక్రవారం వెలికితీసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని నింపింది. చిన్నారిని హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని కథనాలు
నర్సాపూర్‌లో వివాహిత మిస్సింగ్.. కేసు నమోదు