భార‌త్ స‌మాచార్.నెట్, మెదక్ జిల్లా: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందన్న అక్కసుతో నాలుగేళ్ల కూతురిని హత్య చేసిన తల్లి, ప్రియుడిని జిల్లా పోలీసులు అరెస్టు చేసి, కేసు మిస్టరీని ఛేదించారు. మూడు రోజుల క్రితం చిన్నారిని హత్య చేసిన నిందితులు పరారీలో ఉన్నారు. శివంపేట మండలం శభాష్‌పల్లికి చెందిన బంటు రాజు, తన కూతురు మమత, మనవరాలు మనుశ్రీ కనిపించడం లేదని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో మమతకు గ్రామానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం…