భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, అక్టోబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

ఆదివారం రాశి ఫలాలు.. ఎవరికీ ఎలా ఉందంటే?

ఆదివారం రాశి ఫలాలు.. ఎవరికీ ఎలా ఉందంటే?

భారత్ సమాచార్, డిజిటల్:

మేషం

ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి రావచ్చు. చేపట్టిన పనులను పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. పిల్లల విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో పెద్దలతో మాటపట్టింపులు రావచ్చు. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి.

వృషభం

వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసివస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అవసరమైన సమయంలో ఇతరుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. సోదరులతో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

మిథునం

ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. కళ్లకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. కొత్త వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. దైవచింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళం నెలకొనవచ్చు.

కర్కాటకం

వ్యాపారాలు ఆశించిన విధంగా సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లల విద్య, ఉద్యోగ విషయాలు సంతృప్తినిస్తాయి. దూరపు బంధువుల రాకతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి.

సింహం

కడుపునకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరుగుతుంది. ఉద్యోగ, వృత్తి వ్యవహారాల్లో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాల్లో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

కన్య

బంధుమిత్రుల సహకారంతో పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. పిల్లల ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ఇంట్లో శుభకార్యానికి సంబంధించిన చర్చలు జరుగుతాయి. సమాజంలో ప్రముఖుల నుంచి ఆదరణ లభిస్తుంది.

తుల

ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. బంధువులతో చిన్నపాటి వివాదాలు రావచ్చు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.

వృశ్చికం

కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో చిన్నపాటి మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు లభించకపోవచ్చు. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోయే అవకాశం ఉంది. ఇతరుల ప్రవర్తన వల్ల మానసిక ఆందోళన కలగవచ్చు.

ధనుస్సు

నిరుద్యోగులకు ఎక్కువ శ్రమించినా తక్కువ ఫలితం దక్కే అవకాశం ఉంది. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. పిల్లలకు సంబంధించిన విషయాల్లో సమస్యలు ఎదురవవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి.

మకరం

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు ఉపయోగపడతాయి. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కుంభం

వ్యాపారాల్లో ప్రత్యర్థుల వల్ల ఎదురయ్యే సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థికపరమైన ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రోత్సాహకాలు లభిస్తాయి. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది.

మీనం

ఉద్యోగంలో మంచి పనితీరుతో అధికారుల ప్రశంసలు పొందుతారు. వివేకంతో, మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొత్త వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

గమనిక: ఇవి సంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా రూపొందించిన రాశి ఫలాలు మాత్రమే.