భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ పట్టణంలోని 22వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. స్థానిక MLA డాక్టర్ భూక్య మురళీ నాయక్, కౌన్సిలర్ పద్మం ధనలక్ష్మి ప్రవీణ్ కలిసి ఈ పనులకు శ్రీకారం చుట్టారు. వార్డులో రహదారుల అభివృద్ధి కోసం చేపట్టిన ఈ పనులతో స్థానిక ప్రజలకు మెరుగైన రోడ్డు సదుపాయాలు అందనున్నాయి.
ఈ సందర్భంగా MLA డాక్టర్ మురళీ నాయక్ మాట్లాడుతూ, 22వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం కోసం మొత్తం ₹.50 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఈ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి రమేష్, వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య, కౌన్సిలర్లు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.