భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, అక్టోబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

అడవి పంది మాంసం విక్రయించిన వ్యక్తిపై కేసు నమోదు

అడవి పంది మాంసం విక్రయించిన వ్యక్తిపై కేసు నమోదు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వన్యప్రాణుల సంరక్షణకు విఘాతం కలిగించే చర్యలపై అటవీ శాఖ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అడవి పంది మాంసాన్ని విక్రయించిన వ్యక్తిపై విచారణ జరిపి కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్. విజయలక్ష్మి తెలిపారు.

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని కోమటిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న మూల స్తంభం ప్రాంతానికి చెందిన నూనావత్ వెంకన్నపై విచారణ అనంతరం కేసు నమోదు చేసినట్లు ఆమె వెల్లడించారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వాటికి హాని కలిగించే చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వన్యప్రాణులను వేటాడటం, అక్రమంగా రవాణా చేయడం, చంపడం, వాటిని పట్టుకునేందుకు విద్యుత్ తీగలు అమర్చడం, ఉచ్చులు వేయడం వంటి చర్యలు చట్టరీత్యా నేరాలని విజయలక్ష్మి స్పష్టం చేశారు. అదేవిధంగా వన్యప్రాణుల మాంసాన్ని అక్రమంగా విక్రయించడం, చట్టవిరుద్ధంగా కలిగి ఉండటం కూడా నేరమని తెలిపారు.

ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై సంబంధిత చట్టాలు, నిబంధనల ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. వన్యప్రాణుల సంరక్షణలో ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని, వాటికి హాని కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.