భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వన్యప్రాణుల సంరక్షణకు విఘాతం కలిగించే చర్యలపై అటవీ శాఖ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అడవి పంది మాంసాన్ని విక్రయించిన వ్యక్తిపై విచారణ జరిపి కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్. విజయలక్ష్మి తెలిపారు.

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని కోమటిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న మూల స్తంభం ప్రాంతానికి చెందిన నూనావత్ వెంకన్నపై విచారణ అనంతరం కేసు నమోదు చేసినట్లు ఆమె వెల్లడించారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వాటికి హాని…