భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

1, నవంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

రామాయంపేటలో రోహిత్ రావు బర్త్‌డే సెలబ్రేషన్స్

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్ బర్తడే వేడుకలు ఘనంగా నిర్వహించారు
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్ బర్తడే వేడుకలు ఘనంగా నిర్వహించారు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట పట్టణంలో మెదక్ MLA మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మెదక్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలు చేసుకున్నారు.

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్ బర్తడే వేడుకలు ఘనంగా నిర్వహించారు
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్ బర్తడే వేడుకలు ఘనంగా నిర్వహించారు

ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సేవ చేస్తూ భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్ బర్తడే వేడుకలు ఘనంగా నిర్వహించారు

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సరాపు యాదగిరి, బండారి మహేందర్ రెడ్డి, సంజీవరెడ్డి, పుట్టి రంజిత్, చింతల స్వామి, విప్లవ కుమార్, మానెగల రామకృష్ణయ్య, పుట్టి అక్షయ్, రాజు గుప్తా, నాగులు, తార్య నాయక్, బన్షి నాయక్, మల్లేష్, కుమార్ సాగర్, మామిడి సిద్ధరాములు తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.