భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

కడియం మండలంలో కూటమి అభ్యర్థుల భారీ ర్యాలీ

కడియం మండలంలో కూటమి అభ్యర్థుల ప్రచారానికి భారీ స్పందన

భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: కడియం మండలంలోని కడియపులంక, బుర్రిలంక, వెంకాయమ్మపేట గ్రామాల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులు భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ అభ్యర్థులు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు.

కడియం మండలంలో కూటమి అభ్యర్థుల ప్రచారానికి భారీ స్పందన

జడ్పీటీసీ అభ్యర్థిని రత్నం మహేశ్వరి దేవి అయ్యప్ప, ఎంపీపీ అభ్యర్థి బోడపాటి గోపి మోహిని వీర పుణ్యవతి, ఎంపీటీసీ అభ్యర్థులు తాళం నరేష్, నాగులపల్లి వీరబాబు, క్రొవ్విడి వాసు, అంజూరి లక్ష్మి ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.

కడియం మండలంలో కూటమి అభ్యర్థుల ప్రచారానికి భారీ స్పందన

ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గోరంట్ల రవికిరణ్, మజ్జి పద్మావతి, వాసిరెడ్డి రాంబాబు, మార్గాని సత్యనారాయణ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం కొనసాగించారు.