భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

నార్సింగి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

జప్తి శివునూర్, శంఖాపూర్, శేరిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
జప్తి శివునూర్, శంఖాపూర్, శేరిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, అమ్మకాల్లో ఎలాంటి నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తహసీల్దార్ గ్రేస్ బాయి, ఐకేపీ ఏపీఎం సృజన్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం మెదక్ నియోజకవర్గం నార్సింగి మండల పరిధిలోని జప్తి శివునూర్, శంఖాపూర్, శేరిపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను విక్రయించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దళారులు, ప్రైవేట్ వ్యక్తుల మాటలు నమ్మి ధాన్యం విక్రయించి మోసపోవద్దని హెచ్చరించారు. గతంలో ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యం విక్రయించిన పలువురు రైతులకు ఇప్పటికీ డబ్బులు అందని పరిస్థితులు ఉన్నాయని గుర్తుచేశారు. ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జప్తి శివునూర్, శంఖాపూర్, శేరిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు సంబంధించిన నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో త్వరితగతిన జమ అవుతుందని అధికారులు వివరించారు. దీంతో రైతులకు చెల్లింపుల విషయంలో భరోసా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధాన్యం కొనుగోలు సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ధాన్యంలో పొల్లు తొలగించిన తర్వాతే కాంటా వేస్తామని స్పష్టం చేశారు. ఒక్కో ధాన్యం బస్తా తూకం 41 కిలోల 600 గ్రాములకు మించకూడదని నిబంధన ఉందని తెలిపారు. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధికంగా తూకం వేస్తే రైతులు వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

జప్తి శివునూర్, శంఖాపూర్, శేరిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

అలాగే సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తుందని అధికారులు వివరించారు. రైతులు తమ పంటను ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధరతో పాటు బోనస్ ప్రయోజనాన్ని కూడా పొందాలని కోరారు. రైతులకు పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేలా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.

జప్తి శివునూర్, శంఖాపూర్, శేరిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఈ కార్యక్రమంలో నార్సింగి GPO నాగరాజు, CC శోభ, సర్పంచులు కాబోజి నర్సింలు, పార్స సంతోష్, సంతోష్ గోండస్వామి యాదవ్, కార్యదర్శి నాగరాజు, ఉప సర్పంచులు రాములు, విజయ్ కుమార్, VOలు రామచంద్రం యాదవ్, సత్తయ్య, వార్డు సభ్యులు అరుణ్ యాదవ్, జంగర్ల మురళి, లక్ష్మి, శ్రీనివాస్, గ్రామస్తులు ఇండ్ల బిక్షపతి, వెంకటేశం, కుమార్, శ్రీనివాస్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.