భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

కాట్రియాలలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కొత్త స్రవంతి రాజగుప్త సూచించారు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని గిట్టుబాటు ధర పొందాలని రామాయంపేట మండలం కాట్రియాల సర్పంచ్ కొత్త శ్రావంతి సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కాట్రియాల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కొత్త శ్రావంతి మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటకు సరైన ధర లభించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు ప్రైవేట్ వ్యక్తులు, దళారుల మాటలు నమ్మి ధాన్యం విక్రయించకుండా ప్రభుత్వ కేంద్రాల ద్వారానే అమ్మకాలు జరపాలని కోరారు. దళారులకు తక్కువ ధరకు ధాన్యం విక్రయించడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పారు. అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ప్రభుత్వం కల్పిస్తున్న కొనుగోలు కేంద్రాల అవకాశాన్ని ప్రతి రైతు ఉపయోగించుకోవాలని సూచించారు.

రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కొత్త స్రవంతి రాజగుప్త సూచించారు

రైతులకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని ఆమె కోరారు. రైతులకు కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో రాజ గుప్త, రైతులు, ప్రజాప్రతినిధులు, సహకార సంఘం పాలకవర్గ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.