భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని గిట్టుబాటు ధర పొందాలని రామాయంపేట మండలం కాట్రియాల సర్పంచ్ కొత్త శ్రావంతి సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కాట్రియాల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కొత్త శ్రావంతి మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటకు సరైన ధర లభించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం…






