భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బలగం నటుడి బంపర్ ఆఫర్

ప్రతిభ కనబరిచిన ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం బలగం సినిమా నటుడు మురళీధర్ గౌడ్

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని బలగం సినిమా నటుడు, రామాయంపేటకు చెందిన ఐరన్ మురళీధర్ గౌడ్ ఆకాంక్షించారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచడంతో పాటు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా ప్రోత్సహించేందుకు ఆయన ముందుకొచ్చారు. ఇందులో భాగంగా రామాయంపేట పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు.

ప్రతిభ కనబరిచిన ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం బలగం సినిమా నటుడు మురళీధర్ గౌడ్

ఈ సందర్భంగా విద్యార్థులకు చదువు ప్రాధాన్యతను వివరించారు. పదో తరగతి విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదలతో పాటు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చని తెలిపారు. పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు చదువుకోవడం, సందేహాలను ఉపాధ్యాయులతో నివృత్తి చేసుకోవడం, పరీక్షలకు ముందుగానే సన్నద్ధం కావడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ప్రతిభ కనబరిచిన ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం బలగం సినిమా నటుడు మురళీధర్ గౌడ్

విద్యార్థుల్లో మరింత ఉత్సాహం నింపేందుకు పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఆర్థిక ప్రోత్సాహం అందిస్తానని ఐరన్ మురళీధర్ గౌడ్ ప్రకటించారు. ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున, రెండో ర్యాంకు సాధించిన వారికి రూ.4 వేలు, మూడో ర్యాంకు సాధించిన వారికి రూ.3 వేల చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేస్తానని తెలిపారు. కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించే విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ప్రతిభ కనబరిచిన ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం బలగం సినిమా నటుడు మురళీధర్ గౌడ్

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉంటుందని, సరైన ప్రోత్సాహం, పట్టుదల ఉంటే వారు కూడా ఉన్నత విజయాలు సాధించగలరని అన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకొని కష్టపడి చదవాలని, మంచి ఫలితాలతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ప్రతిభ కనబరిచిన ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం బలగం సినిమా నటుడు మురళీధర్ గౌడ్

ఈ కార్యక్రమంలో ఐరన్ మురళీధర్ గౌడ్ కుటుంబ సభ్యులు, సోదరులు, సోదరీమణులు, కుమారుడు, మనుమడు తదితరులు పాల్గొన్నారు.