భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని బలగం సినిమా నటుడు, రామాయంపేటకు చెందిన ఐరన్ మురళీధర్ గౌడ్ ఆకాంక్షించారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచడంతో పాటు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా ప్రోత్సహించేందుకు ఆయన ముందుకొచ్చారు. ఇందులో భాగంగా రామాయంపేట పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు చదువు ప్రాధాన్యతను వివరించారు. పదో తరగతి విద్యార్థులు ఇప్పటి…