భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

సాఫ్ట్‌బాల్‌లో జాతీయ స్థాయికి దూసుకెళ్లాలి: ఎస్సై కరుణాకర్

సాఫ్ట్ బాల్ లో జాతీయ స్థాయిలో రాణించాలి:ఎస్సై ​

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సాఫ్ట్‌బాల్ క్రీడల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో రాణించాలని ఎస్సై గంగారపు కరుణాకర్ ఆకాంక్షించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ అసాధారణ ప్రతిభ చూపుతూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని క్రీడాకారులకు సూచించారు. క్రీడల ద్వారా మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చని తెలిపారు.

ఇనుగుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల సముదాయ ఆవరణంలో బుధవారం సాఫ్ట్‌బాల్ శిక్షణ శిబిరాన్ని ఎస్సై గంగారపు కరుణాకర్ ప్రారంభించారు. ఇటీవల నిర్వహించిన సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఎంపికైన జిల్లాకు చెందిన 20 మంది క్రీడాకారులకు ఈ శిబిరంలో శిక్షణ ఇవ్వనున్నారు. మండల కేంద్రంలోని హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ తాళ్ల ప్రణయ్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు శిక్షణ కొనసాగనుంది.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆటలో మెళకువలు నేర్చుకోవాలని, క్రమశిక్షణతో సాధన చేస్తూ జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలని ప్రోత్సహించారు.

సాఫ్ట్ బాల్ లో జాతీయ స్థాయిలో రాణించాలి:ఎస్సై ​

పి.డి. ప్రణయ్‌కు పలువురి అభినందనలు

సాఫ్ట్‌బాల్ జిల్లా అధ్యక్షుడు సంజీవరావు, జిల్లా కార్యదర్శి సమ్మెట ప్రేమ్ కుమార్, బేస్‌బాల్ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ.. ఫిజికల్ డైరెక్టర్ తాళ్ల ప్రణయ్ నేతృత్వంలో శిక్షణ శిబిరం నిర్వహించడంతో పాటు ఆయన కోచ్‌గా వ్యవహరించడం అభినందనీయమని తెలిపారు. క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణ అందించి వారు ఉన్నత స్థాయికి చేరుకునేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ ఉపాధ్యక్షుడు ఎ. శ్రీనివాస్, వేముల బాబ్జి, మాజీ వైస్ ఎంపీపీ జల్ల వెంకటేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మద్ది రాజేష్, వెన్నం క్రాంతిరెడ్డి, చిన్నబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.