భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సాఫ్ట్బాల్ క్రీడల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో రాణించాలని ఎస్సై గంగారపు కరుణాకర్ ఆకాంక్షించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ అసాధారణ ప్రతిభ చూపుతూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని క్రీడాకారులకు సూచించారు. క్రీడల ద్వారా మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చని తెలిపారు.
ఇనుగుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల సముదాయ ఆవరణంలో బుధవారం సాఫ్ట్బాల్ శిక్షణ శిబిరాన్ని ఎస్సై గంగారపు కరుణాకర్ ప్రారంభించారు. ఇటీవల నిర్వహించిన సాఫ్ట్బాల్ పోటీల్లో ఎంపికైన జిల్లాకు చెందిన 20 మంది క్రీడాకారులకు ఈ శిబిరంలో శిక్షణ…






