భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

పాఠశాలకు స్వచ్ఛమైన తాగునీరు.. కౌన్సిలర్ చరిత చొరవ

విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఐదో వార్డు కౌన్సిలర్ చౌదరి చరిత తన సొంత ఖర్చులతో పాఠశాలలో RO వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. పిల్లల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె తీసుకున్న ఈ చొరవకు పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.

విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం

మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని అశోక్ సింగిల్ సుశుమందిర్ పాఠశాలలో శుక్రవారం 100 లీటర్ల సామర్థ్యం కలిగిన RO వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కౌన్సిలర్ చౌదరి చరితతో పాటు చౌదరి సుప్రభాత రావు, చౌదరి పృథ్వీరావు, వాసవి, మౌనిక, ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో ఈ ఏర్పాట్లు చేశారు.

విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన తాగునీరు ఎంతో అవసరమని తెలిపారు. పాఠశాలలో చదువుకునే ప్రతి విద్యార్థి శుద్ధి చేసిన తాగునీటిని వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థుల అవసరాన్ని గుర్తించి తాగునీటి సౌకర్యం కల్పించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం

పాఠశాలలో RO వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం పట్ల యాజమాన్యం కౌన్సిలర్ చౌదరి చరిత, ఆమె కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపింది.

విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కవిత, ఉపాధ్యాయులు, BRS నాయకులు దోమకొండ యాదగిరి, వినయ్ సాగర్, యుగంధర్ రావు, మహేష్, ఏనిశెట్టి రమణ, దారం శంకర్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.