భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

ఎమ్మెల్యే సహకారంతో గ్రామానికి కొత్త GP భవనం

హనుమాన్ నగర్ నూతన జిపి లో.. ఘనంగా సింహద్వార  ప్రతిష్టాపనోత్సవం.. ఎమ్మెల్యే సహకారంతో నే నూతన జిపి నిర

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్ తండా నూతన గ్రామపంచాయతీ భవనానికి సింహద్వార ప్రతిష్టాపనోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ధన త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సర్పంచ్ గుగులోతు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య ఈ వేడుకను వైభవంగా జరిపారు.

హనుమాన్ నగర్ నూతన జిపి లో.. ఘనంగా సింహద్వార  ప్రతిష్టాపనోత్సవం.. ఎమ్మెల్యే సహకారంతో నే నూతన జిపి నిర

గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణంలో భాగంగా బ్రాహ్మణోత్తముల వేద మంత్రాల నడుమ ప్రధాన సింహద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుగులోతు అశోక్ కుమార్ తొలుత సింహద్వారం నుంచి ప్రవేశించారు. గ్రామస్తుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు.

ఎమ్మెల్యే సహకారంతో కొత్త GP నిర్మాణం

హనుమాన్ నగర్ నూతన జిపి లో.. ఘనంగా సింహద్వార  ప్రతిష్టాపనోత్సవం.. ఎమ్మెల్యే సహకారంతో నే నూతన జిపి నిర

ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు మెరుగైన పాలనాపరమైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో MLA డాక్టర్ భూక్య మురళి నాయక్ సహకారంతో ఆధునిక హంగులతో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. గ్రామానికి గ్రామపంచాయతీ భవనమే తలమానికమని, ప్రజలకు అవసరమైన పాలనాపరమైన సేవలు ఒకే చోట అందుబాటులో ఉండేలా భవన నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.

హనుమాన్ నగర్ నూతన జిపి లో.. ఘనంగా సింహద్వార  ప్రతిష్టాపనోత్సవం.. ఎమ్మెల్యే సహకారంతో నే నూతన జిపి నిర

ధన త్రయోదశి వంటి శుభదినాన సింహద్వార ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు, ఉపసర్పంచ్ శ్రీలత యాకు, వార్డు సభ్యులు, తండావాసులు తదితరులు పాల్గొన్నారు.