భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్ తండా నూతన గ్రామపంచాయతీ భవనానికి సింహద్వార ప్రతిష్టాపనోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ధన త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సర్పంచ్ గుగులోతు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య ఈ వేడుకను వైభవంగా జరిపారు.

గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణంలో భాగంగా బ్రాహ్మణోత్తముల వేద మంత్రాల నడుమ ప్రధాన సింహద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుగులోతు అశోక్ కుమార్ తొలుత సింహద్వారం నుంచి ప్రవేశించారు. గ్రామస్తుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా ప్రతిష్టాపన…