భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

మెదక్ ఎమ్మార్పీఎస్ నూతన అధ్యక్షుడిగా జమునగళ్ల కుమార్

ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా జమునగళ్ల కుమార్ మాదిగ ఏకగ్రీవ ఎన్నిక

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడిగా జమునగళ్ల కుమార్ మాదిగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం నిర్వహించిన MRPS మెదక్ జిల్లా ముఖ్య సదస్సులో రాష్ట్ర అధ్యక్షుడు కేదాసి మోహన్ మాదిగ నాయకత్వంలో నూతన జిల్లా అధ్యక్షుడి ఎన్నిక చేపట్టారు. ఈ సందర్భంగా కుమార్ మాదిగ పేరును ప్రతిపాదించగా, నాయకులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.

జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం కుమార్ మాదిగ మాట్లాడుతూ మాదిగ, మాదిగ ఉపకులాల ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరినీ కలుపుకొని ముందుకు సాగుతానని చెప్పారు. మాదిగలకు ఎక్కడైనా అవమానం జరిగినా, అన్యాయం ఎదురైనా వారి తరఫున నిలబడి పోరాడుతానని స్పష్టం చేశారు. జాతి గౌరవాన్ని కాపాడుతూ, మాదిగల హక్కుల సాధన కోసం తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.

ఈ సదస్సులో MRPS వర్కింగ్ ప్రెసిడెంట్ పుర ప్రభాకర్ మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు, కార్యదర్శులు ఎర్ర లింగం మాదిగ, సంజీవులు మాదిగ, బాబు మాదిగ, శీను మాదిగ, రూప్ల నర్సింలు, ఆనంద్ మాదిగ, చెవిటి శ్రీనివాస్, MSF మెదక్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాదిగ, మనోజ్ కుమార్ మాదిగ, లచ్చిగాళ్ల దేవయ్య, పృథ్వీ మాదిగ, లక్ష్మణ్ మాదిగ, ప్రభాకర్ మాదిగ తదితర MRPS నాయకులు పాల్గొన్నారు.