భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడిగా జమునగళ్ల కుమార్ మాదిగ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం నిర్వహించిన MRPS మెదక్ జిల్లా ముఖ్య సదస్సులో రాష్ట్ర అధ్యక్షుడు కేదాసి మోహన్ మాదిగ నాయకత్వంలో నూతన జిల్లా అధ్యక్షుడి ఎన్నిక చేపట్టారు. ఈ సందర్భంగా కుమార్ మాదిగ పేరును ప్రతిపాదించగా, నాయకులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.
జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం కుమార్ మాదిగ మాట్లాడుతూ మాదిగ, మాదిగ ఉపకులాల ఐక్యత కోసం నిరంతరం కృషి…






