భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

జేవీవీ ఇనుగుర్తి మండల అధ్యక్షుడిగా దార్ల భాస్కర్

జేవీవీ ఇనుగుర్తి మండల అధ్యక్షులుగా భాస్కర్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జన విజ్ఞాన వేదిక (జేవీవీ) ఇనుగుర్తి మండల నూతన అధ్యక్షుడిగా దార్ల భాస్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు జేవీవీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిర్ర యాకాంతం గౌడ్ ఒక ప్రకటనలో నూతన మండల కార్యవర్గాన్ని వెల్లడించారు. మండలంలో సైన్స్‌పై అవగాహన పెంపొందించడంతోపాటు ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షులుగా గంజి వీరేందర్ రెడ్డి, చిన్నాల కట్టయ్య, గౌరవ సలహాదారులుగా వద్దిరాజు వెంకటేశ్వర్లు, కూటికంటి మధు, అమ్మ యాకయ్య నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఆది చందు, కోశాధికారిగా గాడుదుల గణేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉపాధ్యక్షులుగా కుంభం మహేందర్ రెడ్డి, ఎలమద్రి ప్రభాకర్, మల్లం అజయ్, ఎం. ప్రవీణ్ కుమార్‌లను ఎంపిక చేశారు.

అలాగే చెకుముకి కన్వీనర్‌గా వేముల శ్రీనివాస్, సమతా కన్వీనర్‌గా పొన్నం కవిత, హెల్త్ కన్వీనర్‌గా బూర రజినీకాంత్, సహాయ కార్యదర్శిగా బానోత్ మోహన్ నాయక్, మీడియా కన్వీనర్‌గా గుండ్రపల్లి రవీందర్‌ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు వెల్లడించారు.

సైన్స్‌పై అవగాహన పెంపొందించాలి: డాక్టర్ యాకాంతం గౌడ్

ఆధునిక సమాజంలోనూ పలు ప్రాంతాల్లో ప్రజలు మూఢనమ్మకాలు, అపోహలను నమ్ముతున్నారని జేవీవీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిర్ర యాకాంతం గౌడ్ తెలిపారు. ఇలాంటి అపోహలను తొలగించి ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించేందుకు నూతన కార్యవర్గ సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సైన్స్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ సమాజంలో చైతన్యం తీసుకురావాలని సూచించారు.

మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేస్తాం: భాస్కర్

జేవీవీ నూతన మండల అధ్యక్షుడు దార్ల భాస్కర్ మాట్లాడుతూ ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనలు రేకెత్తించడంతోపాటు సమాజంలో వేళ్లూనుకున్న మూఢనమ్మకాలను నిర్మూలించేందుకు అందరితో కలిసి పనిచేస్తామని తెలిపారు. సైన్స్ పరిజ్ఞానంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా, రాష్ట్ర కమిటీ బాధ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.