భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, సెప్టెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

మెదక్-సిద్దిపేట బ్రిడ్జి స్థానంలో తాత్కాళిక మార్గం

WhatsApp Image 2025-09-15 at 8.04.06 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : మెదక్-సిద్దిపేట మార్గంలో ప్రయాణించేవారికి శుభవార్త. గత 20 రోజులుగా నిలిచిపోయిన రాకపోకలు పునరుద్ధరించారు. నిజాంపేట మండలం నందిగామ గ్రామం వద్ద భారీ వర్షాలకు కూలిపోయిన బ్రిడ్జి స్థానంలో ఆర్ అండ్ బి అధికారులు తాత్కాలిక రహదారిని అందుబాటులోకి తెచ్చారు.

 

ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ.. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అధికారులు యుద్ధప్రాతిపదికన ఈ తాత్కాలిక రోడ్డును నిర్మించారని తెలిపారు. కొత్త బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకు వాహనదారులు ఈ తాత్కాలిక మార్గంపై నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. ఈ సమస్య పరిష్కారానికి సహకరించిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజిరెడ్డి, కాంట్రాక్టర్ రాయపాటి, పలువురు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

 

మరిన్ని కథనాలు : 

 

అంగన్‌వాడీ టీచర్లకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమం