భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : మెదక్-సిద్దిపేట మార్గంలో ప్రయాణించేవారికి శుభవార్త. గత 20 రోజులుగా నిలిచిపోయిన రాకపోకలు పునరుద్ధరించారు. నిజాంపేట మండలం నందిగామ గ్రామం వద్ద భారీ వర్షాలకు కూలిపోయిన బ్రిడ్జి స్థానంలో ఆర్ అండ్ బి అధికారులు తాత్కాలిక రహదారిని అందుబాటులోకి తెచ్చారు.
ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ.. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అధికారులు యుద్ధప్రాతిపదికన ఈ తాత్కాలిక రోడ్డును నిర్మించారని తెలిపారు. కొత్త బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకు వాహనదారులు ఈ తాత్కాలిక మార్గంపై నెమ్మదిగా వెళ్లాలని…





