భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, సెప్టెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆంజనేయులుగౌడ్, మైనంపల్లి హన్మంతరావు

a9b1fe72-5bce-4fca-b62c-66cfbd5069a4

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి నివాసంలో మల్కాజిగిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, సిద్దిపేట్ నియోజకవర్గ ఇంఛార్జి పూజల హరికృష్ణలు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహరచనపై చర్చించారు. స్థానిక ఎన్నికల్లో మంచి విజయాలు సాధించాలని, మెదక్ జిల్లా పరిషత్ గెలవాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన రోడ్ల మరమ్మతులకు, కొత్త విద్యుత్ స్తంభాలకు, విద్య, వైద్యం రంగాలపై జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించాలని మైనంపల్లి హన్మంతరావు, ఆంజనేయులు గౌడ్ కోరారు.

మెదక్ జిల్లా రాజన్నసిరిసిల్ల జోన్‌లో ఉండడం వలన జిల్లాలోని విద్యార్థులు, నిరుద్యోగులు ప్రభుత్వం చేపట్టే నియమకాలలో ఉద్యోగులు పదోన్నతులలో తీవ్రంగా నష్టపోతున్నారని వివరించగా, జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు మెదక్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలని సీఎంను వారు కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో ప్రతి ఇంటికి చేరేలా చర్యలు, గ్రామ – పట్టణ స్థాయి కార్యకర్తలకు శిక్షణ, బూత్ కమిటీల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై చర్చించారు. జిల్లాలో పార్టీ ఐక్యతను పెంపొందించి, ప్రజాసమస్యల పరిష్కారం కోసం అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని వారికి సీఎం సూచించారు.