భారత్ సమాచార్, మెదక్ జిల్లా: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి నివాసంలో మల్కాజిగిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, సిద్దిపేట్ నియోజకవర్గ ఇంఛార్జి పూజల హరికృష్ణలు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహరచనపై చర్చించారు. స్థానిక ఎన్నికల్లో మంచి విజయాలు సాధించాలని, మెదక్ జిల్లా పరిషత్ గెలవాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.…