భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, సెప్టెంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

భార్యను చిత్రహింసలకు గురిచేసిన భర్త

22

భారత్  సమాచార్, ప్రకాశం: తర్లుబాడు మండలం కలుజువ్వలపాడు గ్రామానికి చెందిన గురునాథం బాలాజీకి  భాగ్యలక్ష్మితో పదేళ్ల  క్రితం వివాహం జరిగింది. వారికి నలుగురు సంతానం. బాధ్యత మరిచిన  భర్త బాలాజీ భార్యాబిడ్డలను వదిలి వేరే మహిళతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. అడిగినప్పుడు అడిగినంత  డబ్బులు ఇవ్వకపోతే  భాగ్యలక్ష్మిని చిత్రహింసలకు గురి చేసేవాడు. గత రెండు రోజులు క్రితం అడిగిన డబ్బులు ఇవ్వలేదని, మహిళ అని కూడా చూడకుండా తాళ్లతో కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఇష్టం వచ్చిన విధంగా ఆమెపై దాడి చేసాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాధితురాలిని బంధువులు మార్కాపురం వైద్యశాలకు తరలించి చికిత్స  అందిస్తున్నారు.  విషయం తెలుసుకున్న ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి బాధితురాలిని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.  ఈ దురాగతానికి పాల్పడిన భర్త బాలాజీని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అధికారులకు విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి, జిల్లా నాయకురాళ్ళు కె. రాజేశ్వరి, దర్శి శారా, మార్కాపురం పట్టణ ఐద్వా నాయకులు డి.శివలక్ష్మి,దేవమణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గుమ్మా బాలనాగయ్య, తదితరులు ఉన్నారు.