భారత్ సమాచార్.నెట్, నాగర్ కర్నూల్: అచ్చంపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు ప్రతినిధిగా వ్యవహరిస్తూ, సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆంధ్రా ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదుల నుంచి వచ్చిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోగా, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వరద నీటిని సముద్రం పాలు చేసిందని ఆరోపించారు.
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కుట్రలు పన్నుతున్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్, బల్మూర్, మున్నానూరు చెన్న కేశవ రిజర్వాయర్లను ఎందుకు పూర్తి చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 28న అచ్చంపేటలో జరిగే కేటీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సభా స్థలిని, ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు.
మరిన్ని కథనాలు
శ్రీపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్