భార‌త్ స‌మాచార్.నెట్, నాగర్ కర్నూల్: అచ్చంపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు ప్రతినిధిగా వ్యవహరిస్తూ, సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆంధ్రా ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదుల నుంచి వచ్చిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోగా, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వరద నీటిని సముద్రం పాలు చేసిందని ఆరోపించారు.
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు…