భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, సెప్టెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

దసరా సెలవులలో ఊరికి వెళుతున్నారా జాగ్రత్త

2

భారత్ సమాచార్, సిద్దిపేట: బతుకమ్మ దసరా పండుగల రోజుల్లో ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు, దొంగతనాలు జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనీ సీపీ బి. అనురాధ సూచించారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు, బంగారం, దొంగల బారిన పడకుండా తగు జాగ్రత్తలు వహించాలనీ, దొంగతనాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ప్రజలు ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు సహకరించాలనీ కోరారు. బతుకమ్మ దసరా పండుగ వేళా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నామని, పట్టణాలలో గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియా వాట్సప్ స్టేటస్ లలో గ్రామానికి వెళుతున్నాము అని సమాచారం పెట్టవద్దనీ, పట్టణ, గ్రామల్లో పగలు రాత్రి తిరిగే వారి పట్ల నిఘా పెట్టాలనీ హెచ్చరించారు. ఊరు వెళ్ళేటప్పుడు ఖరీదైన వస్తువులను ఇంట్లో పెట్టకపోవటమే మంచిదన్నారు. తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని, పోలీసులు రాత్రి సమయంలో పెట్రోలింగ్ గస్తి ముమ్మరం చేయడం జరిగిందని తెలిపారు.

మరిన్ని కథనాలు: 

రోడ్డుపై బైఠాయించి బీజేపీ నాయకుల నిరసన

రోడ్డుపై బైఠాయించి బీజేపీ నాయకుల నిరసన