భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, సెప్టెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

WhatsApp Image 2025-09-22 at 8.06.09 PM

భారత్ సమాచార్.నెట్, విశాఖపట్నం జిల్లా : ఐఫోన్ కొనివ్వలేదని తండ్రితో గొడవపడి, మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విశాఖపట్నం జిల్లా సుజాతనగర్‌లో చోటుచేసుకుంది. మృతుడు సాయి మారుతి కెవిన్ (26) గా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. సాయి మారుతి కెవిన్ కొంతకాలం హైదరాబాద్‌లో సినీ పరిశ్రమలో పనిచేసి ఇటీవల ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తనకు ఐఫోన్ కావాలని తండ్రి చంద్రశేఖర్‌ను కోరాడు. అయితే ఈ విషయంలో తండ్రి, కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. తండ్రి ఐఫోన్ కొనివ్వడానికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయి తన గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు.

 

కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఐఫోన్ లాంటి చిన్న విషయానికే ఓ యువకుడు ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానసిక ఒత్తిడితో బాధపడేవారు, ఇలాంటి ఆలోచనలు ఉన్నవారు వెంటనే నిపుణుల సహాయం తీసుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా తక్షణమే సహాయం పొందడం చాలా అవసరం.

 

మరిన్ని కథనాలు : 

 

అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య