భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, సెప్టెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

జందాపూర్ సెక్రటరీ సుల్తానా బేగంపై కేసు నమోదు

10

భారత్ సమాచార్, ఆదిలాబాద్:  జందాపూర్ గ్రామపంచాయతీ సెక్రటరీ సుల్తానా బేగం నిర్లక్ష్యంగా కారును నడిపి ఎస్సీ కాలనీ నందు బతుకమ్మ గద్దెను ఢీ కొట్టింది. మహిళలతో నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ, మహిళల పట్ల బతుకమ్మ పట్ల దుర్భాషలాడిన సంఘటనపై మహిళల ఫిర్యాదుతో ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు పంచాయతీ సెక్రెటరీ సుల్తానా బేగంపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టడం జరుగుతుందని ఆదిలాబాద్ రూరల్ సీఐ కె ఫణిధర్ తెలియజేశారు. ఈ ఘటనపై మహిళా పై, శాఖ పరంగా మహిళ పై అధికారులకు నివేదికను పంపనునట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ఇతరులకు ప్రమాదం కలిగేలా సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి పండుగలను అవమానించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై వి విష్ణువర్ధన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.