భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: సిద్ధిపేట పట్టణ కేంద్రంలోని ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గజమాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారుల సమస్యలు, పనుల పురోగతి వంటి అంశాలను మంత్రి స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ పేదల ఇళ్ల నిర్మాణానికి కట్టుబడి ఉంది; లబ్ధిదారుల ముఖాల్లో సంతోషం కనిపించడం మా లక్ష్యం. ఇందిరమ్మ ఇల్లుల లబ్ధిదారులు త్వరగా ఇళ్లు కట్టుకొని సుఖసంతోషాలతో ఉండాలని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ఈ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి కావాలని కోరుతున్నాను. బీఆర్ఎస్ పాలనలో భారీ అప్పులు చేసి ప్రజలకు భారం మోపారు. టీఆర్ఎస్ 60 ప్రాజెక్టులు చేసి 80 లక్షల కోట్ల అప్పు చేశారు; అంత పెద్ద లిఫ్ట్ పెడితే కరెంట్ బిల్లు ఎవరు కడతారు? ఇది తుగ్లక్ పాలనలా ఉంది. మెగా ప్రాజెక్ట్ అని చెప్పి 1 లక్ష కోట్ల అప్పు చేశారు; ఈ మెగా ప్రాజెక్ట్ను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నిజంగా పేదల కోసం ఇళ్లు ఇస్తోంది; బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కమీషన్లకోసం, తమ ఫోటోలు, ఇమేజ్లకోసం ప్రాజెక్టులు చేపట్టింది’ అని అన్నారు. అనంతరం లబ్ధిదారులు మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇళ్లు అందజేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
మరిన్ని కథనాలు:
ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతున్న పేదవాడి సొంతింటి కల