భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, సెప్టెంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

CP Radhakrishnan: బెజవాడ కనకదుర్గమ్మ సేవలో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

1200-675-25079503-thumbnail-16×9-vice-president

భారత్ సమాచార్.నెట్, విజయవాడ: భారత్ ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ బుధవారం బెజవాడ కనదుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఉప రాష్ట్రపతికి ఆలయ అధికారులు, ప్రభుత్వ అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.

 

ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉప రాష్ట్రపతిని శాలువతో సన్మానించి.. అమ్మవారి తీర్థప్రసాదాలతోపాటు, చిత్రపటాన్ని అందజేశారు ఆలయ అధికారులు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మూడో రోజు అన్నపూర్ణ దేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది బెజవాడ దుర్గమ్మ. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

 

ఇక కృష్ణానది పున్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్‌లో కూడా ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పాల్గొననున్నారు. అనంతరం రాత్రి తిరుమల చేరుకుంటారు ఉప రాష్ట్రపతి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వెళ్తున్న ఆయన.. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని బ్రహ్మోత్సవాలల్లో పాల్గొననున్నారు. కాగా ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన సీపీ రాధాకృష్ణన్ తొలిసారిగా ఏపీలో పర్యటిస్తున్నారు.

 

మరిన్ని కథనాలు: 

రైల్వే ఉద్యోగులకు దసరా బోనస్