భారత్ సమాచార్.నెట్, సిద్దిపేట : జిల్లాలో డ్రగ్స్ రహిత సమాజం కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. సిద్దిపేట టాస్క్‌ఫోర్స్, హుస్నాబాద్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురు గంజాయి విక్రేతలను అరెస్ట్ చేసి, వారి నుంచి 200 గ్రాముల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హుస్నాబాద్ పట్టణంలోని మహమ్మదాపూర్ రోడ్డులో గంజాయిని వినియోగిస్తూ, ఇతరులకు విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. అరెస్టు చేసిన నిందితులను విచారించగా, వారు కరీంనగర్‌కు చెందిన ఒక వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీఐ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామాలు, హోటళ్లు, కల్లు డిపోల వద్ద ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ఈ ఆపరేషన్‌లో ఎస్సై లక్ష్మారెడ్డి, ఇతర పోలీసులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు :
ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించిన మంత్రి వివేక్ వెంకట స్వామి