భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, సెప్టెంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

నాళ్ళ వీరన్నకు ZEE తెలుగు అచీవర్స్ అవార్డ్

ab269153-6517-43f3-9c76-c28edccde71b

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ZEE తెలుగు అచీవర్స్ అవార్డ్స్ లో భాగంగా మన మహబూబాబాద్ పట్టణానికి చెందిన సీఆర్ఐ పంప్స్ డీలర్ ప్రకాశ్ ఎలక్ట్రికల్స్ అధినేత నాళ్ళ వీరన్నకి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా హైదరాబాద్ లో జరిగిన ZEE తెలుగు అవార్డ్స్ కార్యక్రమంలో అందజేశారు. ఈ అవార్డ్ తనకు లభించడం ఆనందంగా ఉందని, మహబూబాబాద్ పట్టణం కేంద్రంగా ప్రకాష్ ఎలక్ట్రానిక్ వినియోగదారులసేవలో నాలుగు దశబ్దాలకుపైగా సేవలు అందిస్తున్నామని, వినియోగదారులకు తాము అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు వచ్చినట్టు భావిస్తానని నాళ్ల వీరన్న అన్నారు. ఈ అవార్డు ప్రకటించిన zee తెలుగు యాజమాన్యానికి, తమ వ్యాపారంలో సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్న మిత్రులకు, రైతులకు, మెకానిక్ సోదరులకు ప్రకాశ్ ఎలక్ట్రికల్స్ అధినేత నాళ్ళ వీరన్న ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తు లోనూ ఇదే రీతిన జిల్లా ప్రజలకు సేవలు అందిస్తామని వీరన్న తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, ప్రకాశ్ ఎలక్ట్రికల్స్ అధినేత నాళ్ళ వీరన్న ను ప్రత్యేకంగా అభినందించారు.