భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, సెప్టెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

71f3d6a6-9734-42c7-854b-38781086ecd9

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: బడుగు, బలహీన వర్గాల కోసం అహర్నిశలు పాటుపడిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప మహనీయుడని కొనియాడారు. ఆయన స్వాతంత్ర్య ఉద్యమంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రత్యేక పాత్ర పోషించారని అన్నారు. పౌరహక్కుల ఉద్యమ సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో, వందేమాతరం ఉద్యమంలో పాల్గొని స్వాతంత్య్ర కాంక్షను ముందుకు నడిపారని తెలిపారు. క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో ఆబిడ్స్‌ పోస్టాఫీసుపై, కోఠీలో ఉన్న బ్రిటిష్‌ రెసిడెన్సీపై జాతీయ జెండా ఎగురవేసి సంచలనం సృష్టించారని అన్నారు. ఆయన ఉద్యమ స్ఫూర్తిని భావి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాంనాథ్, సత్యనారాయణ గౌడ్, ముత్యం రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.