భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయిపై సిద్దిపేట న్యాయవాదులు అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని దళిత వర్కింగ్ జర్నలిస్టు సొసైటీ జిల్లా అధ్యక్షులు బబ్బురూ రాజు, జిల్లా అధ్యక్షుడు జంగం రాజలింగం అన్నారు. శనివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా సిద్దిపేట కోర్టు న్యాయవాదులు శ్రీకాంత్, మురళీమోహన్రావు లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయిపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వాక్యాలు చేయడం అత్యంత దుర్మార్గం, సిద్దిపేట బార్ కౌన్సిల్ వెంటనే వారిద్దరి సభ్యత్వాన్ని రద్దు చేయాలి వాళ్ళు తిరిగి ఆ వృత్తిలో కొనసాగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన కొద్ది గంటలకే బెయిల్ మంజూరు కావడం ఆ వెంటనే బిస్కెట్లు, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకోవడం అత్యంత సిగ్గుచేటయినా చర్యక భావిస్తున్నాం. సుప్రీం కోర్టు న్యాయమూర్తి పై వ్యాఖ్యలు చేస్తే కొంతమంది న్యాయవాదులు సమర్ధించడం బాధాకరమైనది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అనుచిత వాక్యాలు చేసిన ఇద్దరు లాయర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వారు భవిష్యత్తులో అ వృత్తిలో కొనసాగకుండా చూడాల్సిన బాధ్యత సిద్ధిపేట బార్ కౌన్సిల్ అసోసియేషన్ పై ఉందని గుర్తు చేస్తున్నాం. ఈ సమావేశంలో డిడబ్ల్యూజేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్ధన్, కోశాధికారి దాసరి చంద్రం, పిఆర్ఓ నర్సయ్యలు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు:
రోడ్డుపై బైఠాయించి బీజేపీ నాయకుల నిరసన