భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, సెప్టెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

బిసి రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలి

29

భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: జిల్లా కేంద్రంలో 42% రిజర్వేషన్ విషయంలో బిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ  ‘కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి బి.సి రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలి.గవర్నర్ ఆమోదం లేకుండా జి.ఓ 9 జారీచేయడం చట్టవిరుద్ధం.స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకనే రేవంత్ డ్రామాలుఆడుతున్నారు. బి.సి లను మరోసారి మోసం చేసి ఓట్లు దండుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి బి.సి. లకు పొందుపరిచిన సంక్షేమ పథకాలు మరియు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  కామారెడ్డి బీసీ డిక్లరేషన్ రిజర్వేషన్స్ బీసీ రిజర్వేషన్లు కులగణన మరియు బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలలలో పెంచబడతాయి.స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు ప్రస్తుత 23% నుండి 42% కు పెంచి, పంచాయతీలు మరియు మున్సిపాలిటీలలో 23,973 కొత్త రాజకీయ నాయకత్వ స్థానాలు కల్పిస్తారు. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణను అందిస్తారు.ప్రభుత్వ సివిల్ కట్టడాలు మరియు నిర్వహణ కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్.మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ సబ్ ప్లాన్‌కి చట్టబద్ధ హోదా ఇచ్చి, మొదటి అసెంబ్లీ సమావేశంలో సరిపడిన నిధులు కేటాయిస్తారు. బీసీ సంక్షేమానికి సంవత్సరానికి రూ.20,000 కోట్లు ఖర్చు చేసి, 5 ఏళ్లలో రూ.1 లక్ష కోట్లు కేటాయిస్తారు. ఎంబీసీ సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షిస్తారు.  అన్ని బీసీ కులాల అభివృద్ధి కోసం కార్పొరేషన్లు ఏర్పరచబడతాయి. యువతకు వడ్డీ రహిత రుణాలు, తాకట్టు రహిత రుణాలు రూ.10 లక్షల వరకు ఇచ్చి చిన్నవ్యాపారాలుప్రారంభించడానికి, ఉన్నత విద్యను సాధించడానికి సహాయపడతారు.జిల్లా కేంద్రాలలో ఒక్కొక్కటికి రూ.50 కోట్లు ఖర్చుతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్య భవనాలు నిర్మిస్తారు. వాటిలో కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్ ఏర్పాటు చేస్తారు. జిల్లాలో బీసీ సంక్షేమ కార్యాలయం కూడా అక్కడే ఉంటుంది.అని చెప్పి మాట తప్పారు’ అని అన్నారు.

మరిన్ని కథనాలు: 

వనపర్తిలో రూ.57కోట్లతో క్రీడా పాఠశాల