భారత్ సమాచార్.నెట్, కృష్ణా: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ) విద్యార్థులకు దసరా సెలవుల సందడి మొదలైంది. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ప్రకటించారు. తరగతులు అక్టోబర్ 6 నుంచి పునఃప్రారంభమవుతాయి. దీంతో విద్యార్థులు శనివారం నుంచే ఇళ్లకు పయనమయ్యారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ నూజివీడు డిపో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దూర ప్రాంతాల విద్యార్థులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ట్రిపుల్ ఐటీ నుంచి 41 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
మరిన్ని కథనాలు
రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు: మంత్రి అచ్చెన్నాయుడు