భారత్ స‌మాచార్.నెట్, కృష్ణా: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ) విద్యార్థులకు దసరా సెలవుల సందడి మొదలైంది. నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల‌ 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ప్రకటించారు. తరగతులు అక్టోబర్ 6 నుంచి పునఃప్రారంభమవుతాయి. దీంతో విద్యార్థులు శనివారం నుంచే ఇళ్లకు పయనమయ్యారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ నూజివీడు డిపో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దూర ప్రాంతాల విద్యార్థులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ట్రిపుల్ ఐటీ నుంచి 41 ప్రత్యేక బస్సులను ఏర్పాటు…