భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, సెప్టెంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

అమ్మవారి దర్శనానికి వెళ్తూ మృత్యుఒడికి..

WhatsApp Image 2025-09-28 at 6.46.51 PM

భారత్ సమాచార్.నెట్, తూర్పుగోదావరి జిల్లా: భవాని దీక్షలో ఉన్న భక్తులపై వేగంగా దూసుకొచ్చిన కారు రూపంలో మృత్యువు కబళించింది. నల్లజర్ల మండలం పుల్లలపాడు గ్రామం వద్ద హైవేపై పాదయాత్రగా విజయవాడ వెళ్తున్న భవాని భక్తులపై అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో నక్కపల్లి మండలం దాసలపాడు గ్రామానికి చెందిన పాకృతి శివ (35), పాకృతి రాము (22) అనే ఇద్దరు భవాని భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

 

క్షతగాత్రులను వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి వస్తున్న కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

 

మరిన్ని కథనాలు : 

 

అర్ధరాత్రి వృద్ధులను కట్టేసి దొంగతనం